: శాంతికాముకులమంటూ అత్యాచారాలు... భారతీయులపైనా కేసులు ఉన్నాయని ఐరాస నివేదిక


శాంతి పర్యవేక్షకులుగా వివిధ దేశాల్లో సేవలందించిన భారతీయులపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయని వెల్లడైన ఐక్యరాజ్యసమితి నివేదిక సంచలనం కలిగించింది. 2010 నుంచి 2013 మధ్య నాలుగేళ్లలో మొత్తం లక్ష మంది యూఎన్ శాంతి దళాల్లో పనిచేయగా, 64 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయని, అందులో మూడు కేసుల్లో భారతీయులు నిందితులుగా ఉన్నారని తెలిపింది. ఐరాస వెల్లడించిన నివేదిక ప్రకారం, ఇండియా నుంచి 8 వేల మంది భారతీయులు శాంతిని పర్యవేక్షించే సభ్యులుగా సేవలందిస్తున్నారు. సౌతాఫ్రికా నుంచి 2,160 మంది సభ్యులుండగా, 9 మందిపై కేసులు నమోదయ్యాయని, ఉరుగ్వేకు చెందిన వారు 1500 మంది ఉండగా, 8 మందిపై ఆరోపణలు వచ్చాయని వివరించింది. చాలా కేసుల్లో 'పీస్ కీపర్స్' బలవంతాలు చేయలేదని, మహిళల పేదరికాన్ని ఆసరాగా తీసుకుని ఆభరణాలు, దుస్తులు, ఆహారం, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివి బహుమతిగా ఇచ్చి లొంగదీసుకున్నారని తెలిపింది. కాగా, 2008లో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో భారతీయులపై లైంగిక ఆరోపణలు రాగా, వారిలో ఎవరైనా అక్కడి మహిళలతో పిల్లల్ని కన్నారా? అన్న విషయం తేల్చేందుకు 12 మంది అధికారులు, 39 మంది భద్రతా దళాలకూ డీఎన్ఏ పరీక్షలకు భారత్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News