: గవర్నర్ ను తొలగించే విషయంపై కేంద్రం ఆలోచించాలి: ఏపీ ప్రభుత్వ విప్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను తప్పించే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉంటూ ఒక రాష్ట్రం పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సెక్షన్-8 చెల్లనప్పుడు విభజన చట్టం మొత్తం చెల్లనట్టేనని కూన పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, విద్యుత్ అన్నింటినీ చట్ట ప్రకారం తీసుకున్న కేసీఆర్, సెక్షన్ అమలు కాదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దానిపై గవర్నర్ మౌనం వహించడం దారుణమని మండిపడ్డారు. చట్టాలను అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఆయనున్నారని ధ్వజమెత్తారు.