: 'చంద్రన్న సంక్రాంతి', 'రూపాయికి కిలో బియ్యం'తో ప్రజా ధనం దుర్వినియోగం... జేసీ వ్యాఖ్య
అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రన్న సంక్రాంతి, రూపాయికి కిలో బియ్యం పథకాల అమలుతో ప్రజా ధనం దుర్వినియోగం కావడం మినహా ప్రయోజనమేమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉపాధి హామీ పథకంలో కూలీల కంటే ఫీల్డ్ అసిస్టెంట్లకే లబ్ధి చూకూరుతోందన్నారు. మనమేమీ మహాత్మా గాంధీ శిష్యులం కాదన్న జేసీ, రాజకీయాల్లో డబ్బు లేనిదే మనుగడ సాధ్యం కాదన్నారు. సర్పంచ్ పదవి నుంచి ప్రధాని పదవి దాకా జరిగే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టనిదే గెలవలేమని ఆయన వ్యాఖ్యానించారు.