: టీఆర్ఎస్ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం?


ఏపీ ముఖ్యమంత్రి ఆడియో టేపులు, రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. టీడీపీని పూర్తిగా ఇరకాటంలో పెట్టేందుకు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ క్రమంలో, టీఎస్ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. చంద్రబాబు ఫోన్ ట్యాప్ అయిందని నిరూపించడానికి అవసరమయ్యే ఆధారాల కోసం అన్వేషిస్తోంది. ఆడియో రికార్డులకు సంబంధించి టీఎస్ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి వరంగల్ లో చేసిన ప్రకటనను కీలక ఆధారంగా చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ట్యాపింగ్ జరగకపోతే ఆడియో టేపులు బయటకు ఎలా వస్తాయన్న కోణంలో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తోంది.

  • Loading...

More Telugu News