: కేసీఆర్ తో భేటీ అయిన ఏకే ఖాన్... ఓటుకు నోటు, చంద్రబాబుకు నోటీసులు తదితర అంశాలపై చర్చ


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన పురోగతిపై వీరు చర్చించారు. ఈ కేసులో పక్కాగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమాలోచనలు చేశారు. అలాగే ఫోన్ సంభాషణలపై కూడా వీరు చర్చించారు. రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనున్నారనే వార్తల నేపథ్యంలో, వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. నోటీసులు ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై కూడా వీరు చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News