: ఐఎస్ఐఎస్ పై భీకరదాడి... అమాయకులు సహా 71 మంది మృతి
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద శిబిరాలపై ఇరాక్ సైన్యం యుద్ధవిమానాలు, బాంబులతో అనూహ్య దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన వాహన శ్రేణిపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో పలువురు అమాయకులు సహా 71 మంది మరణించారు. వీరిలో అత్యధికులు ఉగ్రవాదులేనని తెలుస్తోంది. ఇదిలావుండగా, అన్బార్, నినేవ్, సలాహుదీన్ ప్రావిన్స్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు, సైన్యం మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఉగ్రవాదులు రెండు ఫ్యూయెల్ ట్యాంకులను తీసుకెళ్తుండగా వాటిని సైన్యం ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ ఆయుధ స్థావరాలపైనా బాంబుదాడి చేసింది. ఈ దాడుల్లో ఇరాక్ సైన్యానికి అమెరికా తనవంతు సాయం చేస్తూ, యుద్ధవిమానాలు పంపింది.