: 'అల్లం'పై మక్కువ పెంచుకుంటున్న కేసీఆర్


మూడు రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. నిన్న మాత్రం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అంతకుముందు రెండు రోజులూ ఆయన బయటెక్కడా దర్శనం ఇవ్వలేదు. మరి ఎక్కడికి వెళ్లారని అనుకుంటున్నారా? రాజకీయాలకు కాస్తంత సెలవిచ్చి తన ఫాం హౌస్ లో 'అల్లం' పంట వేయడంపై దృష్టి పెట్టారు. మట్టి నమూనాలు పరీక్షించిన నిపుణులు అల్లం పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందని చెప్పడంతో, కేసీఆర్ అల్లంపై మక్కువ పెంచుకున్నారు. కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతం నుంచి మేలురకం విత్తనాలు తెప్పించి, వాటిని విత్తే పనిలో పడ్డారు. శుక్రవారం నాడు నల్గొండ పర్యటన తరువాత నేరుగా ఫాంహౌస్ కు చేరుకున్న ఆయన దుక్కి సిద్ధం చేయించడం, ఆపై భూమి పరిశీలన, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చలు... ఇలా బిజీగా ఉన్నారు. డ్రిప్ విధానంలో పండిస్తున్న పంటలో మంచి దిగుబడి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా రైతులను రంగంలోకి దించాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News