: 'బాబు అండ్ కో' వ్యాఖ్యలతో రాజీనామాకు సిద్ధపడ్డ గవర్నర్...కేంద్రం సూచనతో వెనకడుగు


ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా పనిచేస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఏపీకి అన్యాయం చేస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పాటు ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటుకు నోటు దర్యాప్తు దరిమిలా ఈ ఆరోపణల తీవ్రత ఇటీవల మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అండ్ కో ఆరోపణలతో నరసింహన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేసేందుకూ ఆయన సిద్ధపడ్డారని విశ్వసనీయ సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వారించడంతో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారట. 'ఎవరేం ఆరోపణలు చేసినా, మీరు మాత్రం చట్ట ప్రకారం ముందుకు సాగండి, పరిస్థితి చేయి దాటితే ఎలాగూ మేం స్పందించక తప్పద'న్న కేంద్రం పెద్దల మాటలతో కాస్త కుదుటపడ్డ నరసింహన్ రాజీనామా యోచనను విరమించుకున్నారని తెలుస్తోంది. నరసింహన్ నుంచి రాజీనామా ప్రతిపాదనను అందుకున్న కేంద్ర హోం శాఖ... తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్న దానిపై ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా ఆరా తీసిన తర్వాత నరసింహన్ తో మాట్లాడి, ఆయన రాజీనామా ప్రతిపాదనను విరమింపజేసిందట.

  • Loading...

More Telugu News