: అన్నయ్య పుట్టినరోజు అంటే మాకో పండుగలా వుండేది!: సంగీత దర్శకుడు చక్రి సోదరి
టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి జయంతిని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో చక్రి సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చక్రి సోదరి మీడియాతో మాట్లాడారు. అన్నయ్య చక్రి పుట్టినరోజంటే తమకు పండుగలాంటిదని, కానీ, ఇలా ఆయన జయంతిని జరుపుకోవాల్సి వస్తోందని, ఆ బాధ మాటల్లో చెప్పలేమని అన్నారు. మీడియా ముందుకు రావాలన్న ఆసక్తి కూడా లేదని తెలిపారు. అన్నయ్య చేపట్టిన సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. అందరూ సాయం చేయాలని, తమ కుటుంబం చక్రి ఆశయాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.