: పాక్ ప్రబల శక్తి... మాతో పెట్టుకోవద్దు: బుసలు కొట్టిన ముషారఫ్


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరోసారి బుసలు కొట్టారు. తన భారత వ్యతిరేక వైఖరిని ఓ ఇంటర్వ్యూలో ప్రదర్శించారు. మయన్మార్ ఆపరేషన్ తరహాలో పాక్ భూభాగంలోకి ప్రవేశించాలన్న ఆలోచనలను భారత్ కట్టిపెట్టాలని అన్నారు. పాకిస్థాన్... మయన్మార్ కాదని, తమపై దాడికి దిగొద్దని, తమ ప్రాదేశిక సమగ్రతను సవాల్ చేయవద్దని అన్నారు. పాక్ బలహీన దేశం కాదని, ఓ ప్రబల శక్తి అని స్పష్టం చేశారు. పాక్ అణ్వస్త్ర సహిత దేశమని, తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఇక, భారత్ ప్రధాని నరేంద్ర మోదీపైనా ధ్వజమెత్తారు ముషారఫ్. మోదీ భారత్-పాక్ శాంతిచర్చలను జటిలం చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News