: ఆసుపత్రి నుంచి మంత్రి ఈటెల డిశ్చార్జ్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సికింద్రాబాదు యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శనివారం నాడు ఆయన వాహనం కరీంనగర్ జిల్లాలో బోల్తా కొట్టడం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయాలపాలైన ఈటెలను తొలుత కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న ఆయన సోమవారం డిశ్చార్జ్ అయ్యారు.