: వేములవాడ రాజన్నకు కోడె మొక్కు తీర్చుకున్న తెలంగాణ స్పీకర్


తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కరీంనగర్ జిల్లా వేములవాడ విచ్చేశారు. అక్కడ వేములవాడ రాజన్నకు కోడె మొక్కు తీర్చుకున్నారు. మొక్కు ప్రకారం ఓ కోడెను ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు స్వాగతం పలికారు. పూజ అనంతరం స్పీకర్ కు ఆలయ వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News