: కడపలో స్కూల్ ప్రారంభించిన హీరో మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు కడపలో సందడి చేశారు. స్ప్రింగ్ బోర్డు ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్రాంచైజీని ఆయన నేడు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య ధనికులకే పరిమితం కారాదన్నది తమ అభిమతమని తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసమే స్ప్రింగ్ బోర్డు స్కూళ్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 35 బ్రాంచ్ లు నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఇతర రాష్ట్రాల్లోనూ స్కూళ్లు ప్రారంభిస్తామని తెలిపారు. కాగా, విష్ణు రాకతో కడపలో సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు అభిమానులు పోటీలు పడ్డారు.