: గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ భేటీ... గంటకు పైగా చర్చలు


గవర్నర్ నరసింహన్ తో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. వీరి సమావేశం గంటకు పైగా కొనసాగింది. ఈ భేటీలో ప్రధానంగా సెక్షన్-8తో పాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాజధానిపై గవర్నర్ కు అధికారాలను సెక్షన్-8 కల్పిస్తుందన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, నగర శాంతిభద్రతలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఢిల్లీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. మరోవైపు, ఓటుకు నోటు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కేసీఆర్ కు గవర్నర్ వివరించారు.

  • Loading...

More Telugu News