: ఇస్లాం అంటే ద్వేషం, అతివాదం కాదు: ఫ్రాన్స్ ప్రధాని
ఇస్లాంకు, అతివాదానికి సంబంధమే లేదని ఫ్రాన్స్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్ అన్నారు. ఫ్రాన్స్ లోని ముస్లిం సమాజంతో మెరుగైన సంబంధాల కోసం పారిస్ లో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇస్లాం అంటే ద్వేషం, అతివాదం కాదని అన్నారు. ఇస్లాం అంటే ఇది కాదు అన్న విషయాన్ని గట్టిగా చాటాలని పిలుపునిచ్చారు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు, యూదు వ్యతిరేకత, ఇజ్రాయెల్ పై ద్వేషం, కొందరు ఇమామ్ లు... తదితర అంశాలే హింస, ఉగ్రవాదానికి కారణమవుతున్నాయని వాల్స్ విమర్శించారు.