: రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన కేజ్రీవాల్


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీ రాష్ట్రానికి చెందిన పలు విషయాలపై రాజ్ నాథ్ తో కేజ్రీవాల్ చర్చించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో తలెత్తిన వివాదం గురించి కేజ్రీవాల్ ప్రధానంగా చర్చించారు. అన్ని విషయాల్లో నజీబ్ జంగ్ జోక్యం చేసుకుంటున్నారని... ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా, ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని రాజ్ నాథ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News