: గవర్నర్ పదవిలో నరసింహన్ కొనసాగడం మంచిది కాదు: మర్రి శశిధర్ రెడ్డి


తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేశారా? లేదా? అన్న విషయంపై స్పష్టతను ఇవ్వాలని లేఖలో కోరారు. ఒకవేళ రాజీనామా చేసి ఉంటే... ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో గవర్నర్ పై శశిధర్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీ తరపున ఎన్నికైన తలసానిని టీఆర్ఎస్ తరపున మంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేయిస్తారని గవర్నర్ ను ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేనప్పుడు గవర్నర్ పదవిలో నరసింహన్ కొనసాగడం మంచిది కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News