: ప్రపంచ రికార్డు సెల్ఫీకి బారులు తీరిన మెక్సికన్లు
సోషల్ మీడియాలో సెల్ఫీలకి ఉన్న మోజే వేరు. ఎవరు కలిసినా సెల్పీ తీసి ఫేస్ బుక్, ట్విట్టర్ లలో అప్ లోడ్ చేసి, లైకులు, కామెంట్లు, అభినందనలు, షేర్లు అందుకోవడం యువతరం ప్రత్యేకత. సెల్ఫీలో రికార్డు సృష్టించేందుకు అమెరికాలో ఓ గ్రూప్ సభ్యులు 2,997 మంది సెల్పీ దిగితే, వారి రికార్డును బద్దలు చేసేందుకు మెక్సికో వాసులు బారులుతీరారు. దాదాపు రెండు వేల మంది మెక్సికన్లు సెల్ఫీలు దిగారు. గ్రూపులు, జంటలుగా సెల్పీలు దిగారు. అయితే, వీరి సెల్పీలు గత సెల్పీ రికార్డును బద్దలు కొట్టాయా? లేదా? అనే దానిని న్యాయనిర్ణేతలు ఇంకా ప్రకటించలేదు.