: ఆటోవాలా... ఇండిగో పైలట్ అయ్యాడు!


కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు మహారాష్ట్రకు చెందిన శ్రీకాంత్ పంట్వానే. సంపాదన కోసం ఆటోను నడిపిన ఈ నాగ్ పూర్ వాసి ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థలో పైలట్. ఓ టీ స్టాల్ యజమానితో పరిచయం శ్రీకాంత్ జీవితాన్ని మలుపుతిప్పింది. తండ్రి సెక్యూరిటీ గార్డు కాగా, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు శ్రీకాంత్ చిన్ననాట నుంచే ఎన్నో పనులు చేసేవాడు. ఆటో నడుపుతుండగా, టీ స్టాల్ యజమాని ఓ విషయం తెలిపాడు. కేంద్ర సివిల్ ఏవియేషన్ డైరక్టరేట్ జనరల్ ఆర్థిక స్థోమతలేని విద్యార్థులకు పైలట్ శిక్షణ కోసం ఉపకారవేతనం అందిస్తుందన్న విషయం శ్రీకాంత్ కు చెప్పాడు. చదువులో ముందుండే శ్రీకాంత్ ఆ స్కాలర్ షిప్ పొంది, తద్వారా పైలట్ శిక్షణ పొందాడు. అయితే, ఆ సమయంలో దేశంలో విమానయాన రంగం ఒడిదుడుకులకు లోనవ్వడంతో ఈ మరాఠీ యువకుడికి వెంటనే ఉద్యోగం లభించలేదు. అప్పటికే కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన శ్రీకాంత్ సమయం వృథా చేసుకోవడం ఇష్టంలేక ఓ కార్పొరేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. చివరికి ఇండిగో సంస్థ శ్రీకాంత్ కు పైలట్ ఉద్యోగం ఇచ్చింది. శ్రీకాంత్ ఆసక్తికర ప్రస్థానాన్ని ఇండిగో ట్విట్టర్లో వెల్లడించింది. త్వరలోనే ఇండిగో మేగజైన్ లోనూ ఈ స్ఫూర్తిదాయక కథనం రానుంది.

  • Loading...

More Telugu News