: టి.సచివాలయం ఎదుట తెలంగాణ ఉద్యమకారుడి ఆందోళన
"తెలంగాణ ఉద్యమం కోసం నా ఉద్యోగాన్నే పణంగా పెట్టా... ఇప్పుడు నా ఉద్యోగం నాకు ఇవ్వండి" అంటూ ఓ తెలంగాణ ఉద్యమకారుడు టి.సచివాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈశ్వర్ లాల్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం... తాను చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి, ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన ఉద్యోగం వస్తుందని అతను ఎంతో ఆశ పెట్టుకున్నాడు. కానీ, అతని ఆశలు అడియాశలయ్యాయి. పోయిన ఉద్యోగం తిరిగిరాలేదు. దీంతో, తన ఉద్యోగాన్ని మళ్లీ ఇప్పించాలంటూ మంత్రులను కలిసేందుకు సచివాలయం వద్దకు వచ్చాడు. అక్కడ సరైన స్పందన లేకపోవడంతో, అతను ఆందోళనకు దిగాడు.