: మోదీ ఆనందపూర్ సాహిబ్ పర్యటనపై తొలగని అనిశ్చితి


పంజాబ్ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆనందపూర్ సాహిబ్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. సిక్కుల పరమ పవిత్రమైన ఈ పట్టణం 350వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ వస్తారని పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 17 నుంచి 19 వరకు ఇక్కడ వేడుకలు నిర్వహించనున్నారు. జూన్ 19న ఆనందపూర్ సాహిబ్ తప్పకుండా వస్తానని తమకు మోదీ హామీ ఇచ్చారని ఆయన చెబుతున్నారు. అయితే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మోదీ వస్తారని గట్టిగా చెప్పలేకపోతున్నారు.

  • Loading...

More Telugu News