: అమెరికాకు దూరంగా ఉంటే దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమే: ఉత్తర కొరియా
అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలకు స్వస్తి చెబితే దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమేనని ఉత్తర కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ దారు జంగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ లు పరస్పర చర్చలు, స్నేహసంబంధాలు, సహకారానికి సంబంధించి సంయుక్త ప్రకటన జారీ చేసి 15 ఏళ్లు అయిన సందర్భంగా ఉత్తర కొరియా ఈ ప్రకటన విడుదల చేసింది. పరస్పర నమ్మకం, సయోధ్యకు తగిన వాతావరణం కల్పిస్తే చర్చలు, సంప్రదింపులకు సిద్ధమని ఉత్తర కొరియా సూచించింది. ప్యాంగ్ యాంగ్ నాయకత్వంపై ఆరోపణలు మాని, అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు ఆపేస్తే చర్చలు జరిపేందుకు సిధ్ధమేనంటూ ఉత్తర కొరియా స్పష్టం చేసింది.