: రజనీకాంత్ సతీమణి లతపై కేసు నమోదు
'లింగా' వివాదం రజనీకాంత్ కు తలనొప్పిగా మారగా, 'కొచ్చాడయాన్' సినిమా వ్యవహారం ఆయన అర్ధాంగి లతను చిక్కుల్లో పడేసింది. కొచ్చాడయాన్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదని, దాంతో తమకు నష్టాలు వచ్చాయంటూ డిస్ట్రిబ్యూటర్లు కొన్నాళ్ల క్రితం ఆందోళనకు దిగారు. ఆ వివాదం ముదిరి కోర్టు వరకు వెళ్లింది. కాగా, లత ఆ సినిమాకు సంబంధించి నకిలీ పత్రాలను కోర్టుకు సమర్పించారన్న కారణంగా బెంగళూరులో కేసు నమోదైంది. పోలీసులు ఆమెను విచారించనున్నారు.