: ఆ గొంతు ఎవరిదో చంద్రబాబు చెప్పాలి: హరీష్ రావు డిమాండ్
ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో టేపులో స్టీఫెన్ సన్ తో మాట్లాడిన గొంతు తనదో, కాదో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పాలని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 2007లో నక్కలగండి ప్రాజెక్టుకు అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవో ఇచ్చారని అన్నారు. ప్రతిదానికి తండ్రి ఆదర్శమని చెప్పే జగన్, కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని ఆయన ప్రశ్నించారు. ఏపీ నేతలు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా ప్రాజెక్టులు కట్టితీరతామని ఆయన స్పష్టం చేశారు.