: నా ఉద్దేశం అదికాదు...: నోరు జారడంపై వివరణ ఇచ్చుకున్న రక్షణమంత్రి


"గడిచిన 40-50 సంవత్సరాల నుంచి ఏ విధమైన యుద్ధాలూ లేకపోవడంతో, భారత సైన్యం ప్రాధాన్యత తగ్గిపోయింది" అని చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపడంతో, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ ఉదయం వివరణ ఇచ్చారు. "నా ఉద్దేశం అదికాదు, దేశంలో యుద్దాలు రావాలని నేను ఆకాంక్షించడం లేదు. సైన్యం లేకపోతే దేశ అభివృద్ధి లేదు" అని ఆయన అన్నారు. భారత రక్షణ వ్యవహారాలకు సంబంధించి రెండు రాష్ట్రాల సీఎంలకు తాను లేఖలు రాసినా పట్టించుకోలేదని, అందువల్లే సైన్యానికి ప్రాధాన్యత తగ్గిందని చెప్పానని పారికర్ అన్నారు. యుద్ధాలు రావాలని తాను కోరుకోవడం లేదని, జైపూర్ సమావేశంలో తన ప్రసంగాన్ని వక్రీకరించారని తెలిపారు.

  • Loading...

More Telugu News