: టెర్రరిస్టులకూ ఇలాగే సహకరిస్తారా?: సుష్మాపై సీతారం ఏచూరి ఫైర్
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వీసాకు సిఫారసు చేసి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పెద్ద తప్పే చేసినట్లున్నారు. నిన్నటి నుంచి విపక్షాల నుంచి ఆమె ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు. ఈ విషయం వెలుగుచూసిన వెంటనే కాంగ్రెస్ తన మాటల దాడిని నిన్ననే ప్రారంభించగా, నేటి ఉదయం నుంచి మిగిలిన విపక్షాల నుంచి కూడా నరేంద్ర మోదీ సర్కారుపై వరుస దాడులు మొదలయ్యాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ కాసేపటి క్రితం స్పందిస్తూ ఈ వ్యవహారంలో కేంద్రం తప్పు చేసిందని తేల్చిచెప్పారు. మానవతా దృక్పథంతోనే సాయం చేశామని చెబుతున్న సుష్మా స్వరాజ్, టెర్రరిస్టులకు కూడా ఇదే తరహాలో సాయం చేస్తారా? అని ఆయన నిలదీశారు.