: కూతురు ప్రోద్బలంతోనే లలిత్ మోదీ వీసాకు సుష్మా సిఫారసు: ఆప్ ఘాటు విమర్శ

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వీసాకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సిఫారసుపై ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన కూతురు ప్రోద్బలంతోనే లలిత్ మోదీ వీసాకు సుష్మా స్వరాజ్ సిరఫాసు చేశారని ఆరోపించింది. ఐపీఎల్ కేసులో లలిత్ మోదీ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తోంది సుష్మా కూతురేనని ఆ పార్టీ తెలిపింది. వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా చేసిన పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. లలిత్ మోదీ వీసాకు సిఫారసు చేయడం ద్వారా తప్పు చేసిన సుష్మా స్వరాజ్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆప్ డిమాండ్ చేసింది.