: 3 గంటలకు గవర్నర్ తో కేసీఆర్ భేటీ... బాబుకు నోటీసులపై సమాచారం ఇచ్చేందుకే!
ఈ మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కలవనున్నారు. ఈ మేరకు అపాయింటుమెంట్ ఫిక్స్ అయినట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపై పక్కా ఆధారాలు లభించాయని, ఆయనకు నోటీసులు ఇచ్చే విషయమై గవర్నరుకు సమాచారం ఇచ్చేందుకే కేసీఆర్ రానున్నారని తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలు ఆడియో టేపుల్లో ఉన్న గొంతు బాబుదేనని ఇప్పటికే ఏసీబీకి నివేదిక పంపినట్టు సమాచారం. దీంతో ఆ నివేదికను, రేవంత్ కనిపిస్తున్న వీడియోలు అసలైనవేనన్న నివేదికనూ నరసింహన్ కు చూపి బాబును విచారణకు పిలవాలన్నది తెలంగాణ ప్రభుత్వ యోచన. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు గవర్నరుతో కేసీఆర్ సమావేశం కానున్నారు.