: పోలీసు బాసులతో చంద్రబాబు మరోమారు భేటీ.. ఓటుకు నోటుపైనే చర్చ!


ఓటుకు నోటు వ్యవహారం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు ఏపీ పోలీసు బాసులతో పలు దఫాలుగా ఆయన సమీక్షించారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఏపీ డీజీపీ జేవీ రాముడు సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలోనూ ఓటుకు నోటు వ్యవహారంపై సమీక్షిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిన్న డీజీపీతో పాటు ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లతో భేటీ అయిన చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ను ఏర్పాటు చేసే దిశగా సమాలోచనలు చేశారు. తాజాగా నేటి భేటీలో ఈ విషయంపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News