: గవర్నర్ రబ్బర్ బొమ్మలా వ్యవహరిస్తున్నారు: సీపీఐ నారాయణ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ పై సీపీఐ నేత నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ రబ్బర్ బొమ్మలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇద్దరు సీఎంలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో స్పీకర్ ను డమ్మీగా చేశారని, ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని నారాయణ ఆరోపించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నాడని జైల్లో పెట్టిన ప్రొ.సాయిబాబుపై లేని సానుభూతి... కేంద్రం లలిత్ మోదీపై చూపుతోందని ఆయన విమర్శించారు.