: కన్నబాబులో అసంతృప్తి నిజమే... పునరాలోచించుకోవాలని గంటా సలహా
తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అన్ని పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకునే, ఎమ్మెల్సీ టికెట్లను సీనియర్లకే కేటాయించాలని అధిష్ఠానం నిర్ణయించిందని ఆయన తెలిపారు. తనకు టికెట్ దక్కలేదని కన్నబాబు రాజులో కొంత మేరకు అసంతృప్తి ఉండవచ్చని, అయితే, ఆయన రెబల్ గా పోటీ చేసే విషయంలో మరోసారి పునరాలోచించుకోవాలని సలహా ఇచ్చానని గంటా తెలిపారు. కన్నబాబు పోటీ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. ఒకవేళ పోటీ తప్పనిసరైన పరిస్థితుల్లో దేశం అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అంచనా వేశారు.