: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా కన్నబాబు


ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ నేతల్లో అసమ్మతి సెగ రేగింది. సొంత పార్టీ టీడీపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆ పార్టీ నేత కన్నబాబు నిర్ణయించుకున్నారు. ఈ మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని, ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తానని చెప్పి పార్టీ అధ్యక్షుడు మాట తప్పారని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఇందుకు భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News