: ఆలిండియా ప్రీ మెడికల్ పరీక్షను రద్దు చేసిన సుప్రీం


ఆలిండియా ప్రీ మెడికల్ పరీక్ష (ఏఐపీఎమ్ టీ) ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. నాలుగు వారాల్లోగా మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాలని సీబీఎస్ఈకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఇప్పటికే నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల విడుదల కూడా కోర్టు తీర్పుతో రద్దయ్యాయి. మే 3న జరిగిన ఆలిండియా ప్రీ మెడికల్ పరీక్ష పేపర్ లీకవడంతో సుప్రీంలో పిటిషన్ లు దాఖలయ్యాయి. పరీక్షను మళ్లీ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్ లు విచారించిన కోర్టు, లీకైన పరీక్షా పేపర్ వల్ల లబ్ధి పొందిన వారిని గుర్తించాలని హర్యానా పోలీసులను ఇప్పటికే ఆదేశించింది. ఈ క్రమంలో పరీక్షా ఫలితాల విడుదలను కోర్టు రెండుసార్లు నిలిపివేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News