: ఏపీలో ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు
ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపులేని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విజయవాడ, విశాఖలో ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. విజయవాడలో అనుమతిలేని పాఠశాలలకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. ఒకవేళ తమ అనుమతి లేకుండా పాఠశాలలు తెరిస్తే రోజుకు రూ.10వేల జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలల వివరాలను విద్యాశాఖ అధికారులు వెబ్ సైట్ లో పెట్టనున్నారు. అంతేగాక గుర్తింపులేని పాఠశాలల్లో విద్యార్థులు చేరవద్దని అధికారులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో రెండు పాఠశాలల గుర్తింపును డీఈవో రద్దు చేశారు.