: రాజ్ భవన్ చేరిన ‘ట్రాన్స్ కో’ పంచాయితీ...విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగుల వినతి


తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ట్రాన్స్ కో ఉద్యోగుల బదలాయింపు వ్యవహారం తాజాగా రాజ్ భవన్ చేరింది. ఆంధ్రా నేటివిటీ ఉన్న 1,400 మంది ఉద్యోగులను తెలంగాణ ట్రాన్స్ కో ఏపీకి బదలాయిస్తూ విధుల నుంచి రిలీవ్ చేసింది. అయితే తెలంగాణ సర్కారు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నపళంగా రిలీవ్ ఉత్తర్వుల జారీ సరికాదని చెప్పిన హైకోర్టు తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని నిలుపుదల చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసినా, విధుల నుంచి రిలీవ్ చేసిన ఉద్యోగులను తిరిగి కొలువుల్లోకి తీసుకోవడంలో టీ సర్కారు ఆసక్తి చూపలేదు. దీంతో ఉద్యోగులు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిసేందుకు కొద్దిసేపటి క్రితం రాజ్ భవన్ వెళ్లారు. తక్షణమే రిలీవ్ ఉత్తర్వులను వెనక్కు తీసుకుని తమను విధుల్లోకి తీసుకునేలా తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని వారు గరవ్నర్ ను కోరనున్నారు.

  • Loading...

More Telugu News