: పట్టా కావాలంటే రూ.4 లక్షలివ్వమన్న తహశీల్దార్... టవరెక్కి గుండెపోటుతో రైతన్న మృతి


సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాస్ బుక్కు కావాలని పోతే తహశీల్దార్ రూ.4 లక్షలు లంచమడిగాడు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆ బక్క రైతు నిరసన వ్యక్తం చేసేందుకు సెల్ టవరెక్కాడు. అక్కడే గుండెపోటుకు గురై మృత్యువాతపడ్డాడు. కడప జిల్లా నందలూరు మండల కేంద్రంలో కొద్దిసేపటి క్రితం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని నాగిరెడ్డిపల్లెకు చెందిన రైతు సయ్యద్ మక్బూల్ బాషా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. తహశీల్దార్ అడిగిన మేర లంచమివ్వలేకనే బాషా సెల్ టవరెక్కాడు. అయితే అంతెత్తుకు వెళ్లిన నేపథ్యంలో గుండెపోటుకు గురై చనిపోయాడు. ఈ ఘటనతో నందలూరులో విషాదంతో పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News