: రేవంత్ తరపున రెండో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న లాయర్లు


టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని నేడు ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. రేవంత్ తో పాటు కేసులో ఏ2 నిందితుడు అయిన సెబాస్టియన్, ఏ3 ఉదయ్ సింహలను కూడా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నేటితో వీరికి విధించిన 14 రోజుల రిమాండ్ ముగిసింది. ఈ నేపథ్యంలో, రేవంత్ రిమాండ్ ను మరో 14 రోజుల పాటు ఏసీబీ కోర్టు పొడిగించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ క్రమంలో, ఏసీబీ అధికారులు తమ విచారణ రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించనున్నారు. అనంతరం, రేవంత్ తరపు న్యాయవాదులు రెండో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ మేరకు న్యాయవాది సుధీర్ మీడియాకు వెల్లడించారు. రెండో బెయిల్ పిటిషన్ ఇప్పుడే దాఖలు చేయరాదని తొలుత రేవంత్ తరపు లాయర్లు భావించారు. ఈనెల 17న టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేయనున్నారు. దీంతో, 17 తర్వాత బెయిల్ పిటిషన్ వేయాలని భావించారు. అయితే, తమ ఆలోచనను విరమించుకుని, ఈరోజే రెండో బెయిల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News