: యుద్ధాలు లేక సైన్యం ప్రాధాన్యత తగ్గింది: నోరు జారిన రక్షణమంత్రి
గడచిన 40-50 సంవత్సరాల నుంచి ఏ విధమైన యుద్ధంలో పాల్గొనక పోవడంతో భారత సైన్యం ప్రాధాన్యత తగ్గిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. 'సరిహద్దు రక్షక దళం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు' అనే అంశంపై జైపూర్ లో జరిగిన సదస్సులో మాట్లాడిన ఆయన యుద్ధాలు లేక ప్రజలకు సైతం సైన్యంపై గౌరవం తగ్గిందని అన్నారు. ఆ వెంటనే, నోరుజారానని తెలుసుకున్న ఆయన, తన వ్యాఖ్యలను సరిదిద్దుకుంటూ, "అంతమాత్రాన నేను యుద్ధాన్ని కోరుకుంటున్నానని కాదు" అన్నారు. ఇటీవల సైన్యం మయన్మార్ సరిహద్దులు దాటి మిలిటెంట్లను మట్టుబెట్టి వచ్చిన తరువాత సైన్యం పట్ల ప్రజల మైండ్ సెట్ కొంత మారిందని పారికర్ అభిప్రాయపడ్డారు.