: ఇక ‘సెక్షన్’ ఫైట్... గవర్నర్ విశేషాధికారాలపై వేడెక్కిన చర్చ!


ఓటుకు నోటు కేసులో తాజాగా ‘సెక్షన్’ ఫైట్ కు తెర లేచింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో తమ రక్షణకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఏపీ సర్కారు, గవర్నర్ విశేషాధికారాలే తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని వాదిస్తోంది. అయితే తెలంగాణకు చెందిన ప్రభుత్వం కాని, ఆయా పార్టీల నేతలు కాని హైదరాబాదులో గవర్నర్ విశేషాధికారాలు వినియోగించాల్సిన దుర్భర పరిస్థితులేమీ లేవని చెబుతున్నారు. ఈ విషయంపై నిన్న టీడీపీ నేతలు గవర్నర్ నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఏపీకి కావాలనే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఓటుకు నోటు కేసు కాస్తా సెక్షన్ 8 అమలుపై చర్చకు దారి తీసింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న గవర్నర్ సలహాదారులతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని ఈ సందర్భంగా చంద్రబాబు వాదించారట. అంతేకాక అందుకు కేంద్రం నుంచి ఆపరేషనల్ గైడ్ లైన్సేమీ అవసరం లేదని కూడా చెప్పారట. అయితే ఈ సెక్షన్ అమలుపై కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు రావాల్సిందేనని గవర్నర్ సలహాదారులు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాక గవర్నర్ కాని, తాము కానీ ఏమీ చేయలేమని చెప్పిన సదరు సలహాదారులు, తమ పాత్రపై తమకే స్పష్టత లేదని కూడా వ్యాఖ్యానించారట. దీంతో కాస్త ఇబ్బందిపడ్డ చంద్రబాబు ఈ విషయాన్ని కేంద్రం వద్దే తేల్చుకుంటానని సలహాదారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News