: పాక్ జెండాలు ఎగరేసిన వారిని షూట్ చేయాలి: ప్రవీణ్ తొగాడియా
కాశ్మీర్ లో పాకిస్థాన్ జెండాలు ఎగురవేసిన వారిని షూట్ చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని కచ్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ అనుకూల కాశ్మీర్ వేర్పాటు వాదులపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. కాశ్మీర్లో పాక్ జెండాలు ఎగురవేయడం ఆందోళన కలిగించే పరిణామమని ఆయన పేర్కొన్నారు. రొమ్ము విరుచుకుని పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆ దేశపు పతాకాలు ఎగురవేసే వారిని షూట్ చేయాలని ఆయన సూచించారు. జమ్మూ కాశ్మీర్లోని వేర్పాటువాదులపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.