: బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే: మాయావతి


బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. మోదీ ఏడాది పాలనపై ఆమె విమర్శలు చేశారు. ఎన్డీయే ఏడాది పాలన ప్రజలను నిరాశకు గురి చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం కూడా యూపీఏ అడుగుజాడల్లోనే నడుస్తోందని ఆమె పేర్కొన్నారు. ఏడాది పాలనలో మోదీ నిర్ణయాలు, విధానాలు, చట్టాలను రూపొందించడంలో వ్యవహార శైలి ఇలా ఏవీ ప్రజలను ఆకట్టుకోలేదని ఆమె విమర్శించారు. గడచిన 365 రోజులు ప్రజలకు దుర్దినాలని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి ఉండే బొమ్మ, బొరుసు లాంటివని, దానిని ప్రజలు తెలుసుకోవాలని ఆమె సూచించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ పెట్టుబడిదారుల చెప్పు చేతల్లోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని మాయావతి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News