: కేసీఆర్, జగన్ రాష్ట్రాన్ని బలహీనపరుస్తుంటే, గవర్నర్ సకాలంలో స్పందించడం లేదు: మంత్రి ప్రత్తిపాటి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనతో కుమ్మక్కైన వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలహీనపరచాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు రేగుతుంటే గవర్నర్ సకాలంలో స్పందించకపోవడం వల్లే రెండు రాష్ట్రాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కాగా, ఈ నెల 17 లేదా 18న విజయవాడలో వ్యవసాయ ప్రణాళిక విడుదల చేయనున్నామని అన్నారు. ఖరీఫ్ కు విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు అందుబాటులో ఉంచామని ఆయన ఆయన చెప్పారు. మొక్కజొన్న రైతులకు 140 కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఆయన వెల్లడించారు.