: పాలమూరు ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్ర మంత్రి ఉమాభారతికి జగన్ లేఖ


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖలో ఫిర్యాదు చేశారు. విభజన చట్ట ప్రకారం నదీ జలాల నిర్వహణ బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకుని ఏదయినా ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండగా, దానిని అతిక్రమించి, తెలంగాణ సీఎం పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని ఆయన విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుపై జోక్యం చేసుకుని, తక్షణం ఆపేలా ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సాగునీటి వనరులు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆయకట్టులు కూడా నీటి ఎద్దడి ఎదుర్కొంటాయని ఆయన లేఖలో తెలియజేశారు.

  • Loading...

More Telugu News