: డ్రాగా ముగిసిన భారత్ - బంగ్లా ఏకైక టెస్టు


భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. వరుణుడు విరుచుకుపడడంతో రెండు రోజులు మ్యాచ్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన టీమిండియా విజయాన్ని వర్షం అడ్డుకుంది. ఏకైక టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ను భారత బౌలర్లు 253 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ ఫాలో ఆన్ లో పడింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 23 పరుగులు చేసింది. దీంతో ఐదు రోజుల ఏకైక టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో 173 పరుగులు చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో రాణించగా, అతనికి హర్భజన్ సింగ్ 3 వికెట్లతో చక్కని సహకారం అందించాడు.

  • Loading...

More Telugu News