: పసికందుల్లో పసిగట్టే శక్తి జాస్తి
సిసింద్రీ సినిమా గుర్తుందా.. అందులో బుల్లి అఖిల్.. ఫోటోల్లో చూసిన వాటిని గుర్తు పెట్టుకుని.. తను తప్పిపోకుండా తిరిగి తల్లిదండ్రులను చేరిన వైనం గుర్తుందా. అంత బుడ్డోడికి అవి ఎలా గుర్తున్నాయా..? అని అప్పట్లో మీరు ఆశ్చర్యపోయారా? అందులో అతి ఏమీ లేదు. అయిదు నెలల వయసునుంచే పిల్లలకు అన్నీ గుర్తుంటాయిట.
పరిసరాలను పసిగట్టడం.. గుర్తుంచుకోవడం అనేది.. అయిదునెలల పసికందుల్లో మొదలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారిస్‌లో జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. గుర్తింపునకు సంబంధించిన నాడీ సంకేతాల పై వీరు పరిశోధించారు. 80 మంది పసికందులపై రెండు దశలుగా అధ్యయనం చేశారు. అందరూ 5, 12,14 నెలల వయసు వారేనట. వీరి ఎదుట కొన్ని బొమ్మలను ఉంచి.. గుర్తించగల మెదడు స్పందనలను రికార్డు చేసి ఈ విషయం నిగ్గు తేల్చారు.