: ఆస్ట్రేలియా రిటైల్ దుకాణంపై భారతీయ మహిళ కేసు
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో తాత్కాలిక వీసాతో నివాసం ఉంటున్న భారతీయ మహిళ రజ్వీర్ కౌర్ (25) దగ్గర్లోని వూల్ వర్త్ సూపర్ మార్కెట్ నుంచి పుట్టగొడుగులు తెచ్చుకుని వంట చేసుకుని తింది. అంతే, ఆమె ఆరోగ్యం క్షీణించి, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితి తలెత్తింది, దీంతో ఆమెకు కాలేయం మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. విషపూరితమైన పుట్టగొడుగులు తినడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు. నాలుగు నెలల తరువాత కోలుకున్న ఆమె, తనకు విషపూరిత పుట్టగొడుగులు అమ్మిన ఆ సూపర్ మార్కెట్ కు కోర్టు ద్వారా నోటీసులు పంపించింది. దీనిపై సూపర్ మార్కెట్ యజమాని మాట్లాడుతూ, 2014లో జరిపిన విచారణలో తమ షాపులోని పుట్టగొడుగుల్లో ఎలాంటి విషపదార్థాలు లేవని తేలిందని అన్నారు. ఇప్పుడు రజ్వీర్ కౌర్ నిత్యం వైద్య పర్యవేక్షణలోనే జీవించాలి. దీంతో భారత్ లో అలాంటి సౌకర్యం లభించదు కనుక, తనకు శాశ్వత పౌరసత్వం ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో విధులు నిర్వర్తించే అవకాశం లేని ఆమె స్ధానిక సిక్కుల సాయంతో జీవిస్తున్నారు.