: అజయ్ తో కటీఫా? అవన్నీ పుకార్లు: రోహిత్ శెట్టి
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి, ప్రముఖ హీరో అజయ్ దేవ్ గన్ మధ్య విభేదాలు పెరిగిపోయాయని, షారూఖ్ తో బంధం బలపడడంతో అజయ్ తో బెడిసికొట్టినట్టేనని వస్తున్న పుకార్లకు రోహిత్ శెట్టి సమాధానం చెప్పాడు. అజయ్ తో బంధం చాలా దృఢమైనదని చెప్పాడు. తామిద్దరం అన్నదమ్ముల్లాంటి వారమని పేర్కొన్నాడు. అజయ్ తో 25 సంవత్సరాల సన్నిహిత సంబంధం ఉందని, ఆయన తన కుటుంబ సభ్యుడిలాంటి వాడని రోహిత్ అన్నాడు. గోల్ మాల్ సిరీస్, సింగమ్, బోల్ బచ్చన్ ఇలా తొమ్మిది సినిమాలకు తామిద్దరం కలిసి పని చేశామని, భవిష్యత్ లో మరిన్ని సినిమాలకు కలిసి పనిచేస్తామని రోహిత్ శెట్టి చెప్పాడు.