: ఎర్రబెల్లికి చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నుంచి బయటికి రావాలి: హరీష్ రావు
తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు చిత్తుశుద్ధి ఉంటే పార్టీ నుంచి బయటకి రావాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎర్రబెల్లి పచ్చకామెర్లున్న వ్యక్తిలా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖను వాపస్ తీసుకునేలా చేయాలని ఆయనకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వానికి, రైతులకు వ్యతిరేకంగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలు, చేస్తున్న వ్యాఖ్యలు ఆపేలా ఎర్రబెల్లి ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎర్రబెల్లి టీడీపీని వీడాలని ఆయన సవాలు విసిరారు. మిషన్ కాకతీయను విమర్శిస్తే పుట్టగతులు లేకుండా పోతారని ఆయన శాపనార్థాలు పెట్టారు. గతంలో కమీషన్లు దండుకున్న చరిత్ర ఎర్రబెల్లికి ఉందని ఆయన ఆరోపించారు.