: పట్టువదలని విక్రమార్కుడు రికార్డు సృష్టిస్తాడట!
మాట తప్పని మనిషి, పట్టువదలని విక్రమార్కుడు అనే ఉపమానాలు రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన శివచరణ్ యాదవ్ కు అతికినట్టు సరిపోతాయి. శివచరణ్ యాదవ్ మంచి వయసులో ఉండగా, తాను పదవ తరగతి పాసైతే తప్ప పెళ్లి చేసుకోనని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆయన పదవ తరగతి పరీక్షలకు హాజరవుతూనే ఉన్నాడు. ఇలా 46 సార్లు పరీక్షలకు హాజరయ్యాడు. 46వ సారి కూడా ఆయన ఆశించిన ఫలితం సాధించలేకపోయాడు. ఈసారి మాత్రం ఒక సబ్జెక్టులో పాస్ అయ్యాడు. ఇప్పుడాయన వయసు 81 ఏళ్లు. పదవ తరగతి పాస్ కాకపోవడంతో ఆయన అవివాహితుడుగానే మిగిలిపోయారు. ఈసారి పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమయ్యాను కానీ, వార్ధక్యం కారణంగా కళ్లు మసకబారడం, చేతులు వణకడంతో సరిగా రాయలేకపోయానని, ఈసారి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై రికార్డు సృష్టిస్తానని శివచరణ్ యాదవ్ తెలిపాడు.