: బాబుపై కేసు నమోదు చేయకుంటే కేంద్రం, టీఆర్ఎస్ లాలూచీ పడ్డట్టే!: సీపీఎం మధు


ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై కేసు నమోదు చేయని పక్షంలో కేంద్రం, టీఆర్ఎస్ ప్రభుత్వాలు బాబుపై కేసు విషయంలో లాలూచీ పడ్డాయని భావించాల్సివస్తుందని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పొలాకిలో నిర్మించదలచిన పవర్ ప్లాంట్ ఒప్పందం ఏకపక్షంగా జరిగిందని ఆయన విమర్శించారు. పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం 1500 ఎకరాల భూసేకరణకు అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయని ఆయన మండిపడ్డారు. జూన్ 23 నుంచి ప్రారంభం కానున్న లారీల సమ్మెకు సీపీఎం మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News